
ఆపరేషన్ సిందూర్ ఒక పేరు మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల భావన అని మోదీ చెప్పారు. ఆవేదన అని చెప్పారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ను సక్సెస్ చేసిన భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ లో మన బలగాలు ఎంతో సాహసాన్ని ప్రదర్శించాయని తెలిపారు. ధైర్యాన్నిచూపాయన్నారు. దేశప్రజలందరి తరుపున సైన్యానికి తన ధన్యవాదాలు చెప్పారు. దేశప్రజలందరూ ఒకే మాటమీద నిలబడ్డారని ప్రధానిమోదీ అన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు భారత సైన్యానికి అండగానిలిచామని చెప్పారు. హహాల్గామ్ లో అత్యంత దారుణంగా కుటుంబసభ్యుల మందే చంపేశారని అన్నారు. ఉగ్రవాద చర్యను దేశమంతా ఖండించిందని మోదీ తెలిపారు.
నేలమట్టం చేశామని…
పాక్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశామని, వారు కలలో కూడా ఊహించని విధంగా దాడులు నిర్వహించామని తెలిపారు. దేశ మహిళల సింధూరం దూరం చేస్తే ఏం జరుగుతుందో చూపించామని మోదీ అన్నారు. ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ మిసైళ్లు, డ్రోన్లతో దాడులు నిర్వహించి వారికి కఠినశిక్ష విధించామని మోదీ అన్నారు. గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని అమాయకుల ప్రాణాలను తీస్తున్నారని అన్నారు. ఒక్క దాడితో పాకిస్తాన్ బెంబేలెత్తి పోయిందని మోదీ అన్నారు. ఏడో తేదీ తెల్లవారు జామున ప్రతిజ్ఞనెరవేరడం దేశమంతా చూసిందని మోదీ అన్నారు. బహవుల్ పూర్, మురద్ ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టి కరిపిాంచామని చెప్పారు.
పాక్ మాత్రం…
భారత్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే పాక్ మాత్రం గురుద్వారాలు, ప్రార్థనాలయాలు, స్కూళ్లపై దాడులకు దిగిందని మోదీ అన్నారు. అమాయకుల ప్రాణాలు తీయడానికి తెగించిందని చెప్పారు. దేశమే ముందు అన్న నినాదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉగ్రవాద సంస్థలకు మూలాలను భారత్ కూల్చి వేసిందని మోదీ తెలిపింది. వంద మంది కరడు గట్టిన తీవ్రవాదులను మట్టుపెట్టామని చెప్పారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు సైన్యానికిపూర్తి స్వేఛ్చను ఇచ్చామని మోదీ తెలిపారు. పాక్ ఏ విధంగా వ్యవహరించిందో దేశమంతా చూసిందన్నారు. రానున్నకాలంలో పాక్ కు సరైన బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. భారత త్రివిధ దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పాక్ కు ఒక గుణపాఠమని మోదీ అన్నారు.
అణ్వాయుధాలను చూపి…
మే పదోతేదీన డీజీఎంను పాక్ సంప్రదించి కాల్పులవిరమణ చేపట్టాలని కోరిందని చెప్పారు. అణ్వాయుధాలను చూపెట్టి భారత్ ను భయపెట్టలేదని, పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లను కూడా నాశనం చేశామని మోదీతెలిపారు. పాకిస్తాన్ ఏ దశలోనూ ఆధిపత్యం చూపించలేకపోయిందని మోదీ అన్నారు.పాక్ చర్యలను బట్టి మన స్పందన ఉంటుందని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు ఆపరేషన్ సిందూర్ ను కేవలం నిలిపేశామని, కానీ పాక్ మళ్లీ కాలుదువ్వితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు ఒక కొత్తతరహాలో గుణపాఠం చెప్పగలిగామని మోదీ చెప్పారు. శాంతి కోసమే కాల్పుల విరమణకు అంగీకరించామనిచెప్పారు. టెర్రర్, ట్రేడ్ కలసి ప్రయాణించలేవని మోదీ కుండబద్దలు కొట్టేశారు. బుద్ధపౌర్ణమినాడు శాంతి మార్గంలో ప్రయాణించాలని భావించి వికసిత్ భారత్ ఆవిష్కరణకు ముందడుగువేస్తామని చెప్పారు.