
రెండు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకు మొదటి నుండి సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్ వ్యవహరించాడు. ఇప్పుడు ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో మనోజ్ పరమహంస మిగిలిన సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. ఈయన రీసెంట్ గానే ‘హరి హర వీరమల్లు’ సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు. గతం లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఆయన ఇప్పుడు ఓజీ చిత్రానికి పనిచేయబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్ లోకి ఈ నెల 14న లేదా 15న అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సుమారుగా పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్ని రోజులు చేయనున్నారు. ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఒక స్టేడియం లో చిత్రీకరించబోతున్నటు తెలుస్తుంది.
సాధారణంగా ఈ సినిమాలోని అత్యధిక సన్నివేశాలు బ్యాంకాక్ లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంత దూరం వచ్చే అవకాశం లేకపోవడం తో తాడేపల్లి లోనే భారీ లెవెల్ లో సెట్స్ ని ఏర్పాటు చేశారట. సుమారుగా మూడు వారాల పాటు పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. జూన్ 10 లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి, అదే నెలలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొనాలని చూస్తున్నారట. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 50 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడట. ‘గబ్బర్ సింగ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రమిది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత అవుట్ & అవుట్ కమర్షియల్ మూవీ చేస్తున్నది కూడా ఈ చిత్రమే. విడుదలైన రెండు గ్లింప్స్ వీడియోస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.