
ఇండియా – పాక్ ల మధ్య చర్చలు వాయిదా పడ్డాయి. రెండు దేశాల దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య చర్చలు పన్నెండు గంటలకు ప్రారంభం అవ్వాల్సిన నేపథ్యంలో చర్చలు వాయిదా పడినట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి పాక్ – ఇండియా ల మధ్య చర్చలు ప్రారంభమయ్యే అవకాశాున్నాయి.
తిరిగి ఐదు గంటలకు…
హాట్ లైన్ మధ్య ఇరుదేశాలకు చెందిన సైనికాధికారులు అనేక అంశాలపై చర్చించాల్సిన అధికారులు వాయిదా వేశారు. ఇరు దేశాలు వారి ప్రభుత్వాలతో పూర్తిగా చర్చించిన తర్వాత చర్చలు ప్రారంభించాలన్న నిర్ణయం మేరకు వాయిదా పడినట్లు తెలిసింది. మరి ఐదు గంటలకు అయినా చర్చలు సాగుతాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.