
అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ కు తెరపడింది. రెండు దేశాల మధ్య డీల్ కుదిరింది. అమెరికా ఇటీవల వరసగా సుంకాలు భారీగా పెంచడంతో చైనా కూడా దానికి అనుగుణంగా పన్నులను పెంచింది. అయితే సుంకాల వల్ల భారీగా వస్తున్న నష్టాలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలకు ఒక అంగీకారానికి వచ్చాయి.అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125నుంచి పది శాతానికి తగ్గించింది.
సుంకాలను తగ్గిస్తూ…
మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145నుంచి ముప్ఫయి శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తగ్గింపు కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుందని ఇరు దేశాలకు కుదిరిన ఒప్పందంలో అవగాహనకు వచ్చారు. ఈ ప్రభావంతో కొంత అంతర్జాతీయంగా కూడా ధరల్లో మార్పులు వచ్చే అవకాశముందని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ చెబుతున్నారు.
