
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది. కేవలం ఆస్కార్ గెలిచినందుకు కాదు, రామ్ చరణ్ వంటి అమేజింగ్ ఫెలో తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అందుకే నాటు నాటు సాంగ్ చాలా ప్రత్యేకం. ఈ సాంగ్ కి చిరంజీవి గారు, బాలకృష్ణ బాబాయ్ కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉంది, అన్నారు. ఎన్టీఆర్ కామెంట్స్ కి ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. హాల్ దద్దరిల్లింది. ఆర్ ఆర్ ఆర్ ని ఆస్కార్ బరిలో దించేందుకు రాజమౌళి టీమ్ చాలా కష్టపడ్డారు. దాదాపు ఏడాది పాటు యూఎస్ లో కోట్లు ఖర్చు చేసి క్యాంపైన్ నిర్వహించారు.
నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ గెలుచుకోగా, ఆస్కార్ ఆశలు బలపడ్డాయి. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వేదిక మీద రాహుల్ సిప్లిగంజ్, భైరవ ఆలపించడం విశేషం. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. మరోవైపు లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ గౌరవం దక్కిన అతి తక్కువ మంది హీరోల్లో రామ్ చరణ్ ఒకరిగా నిలిచాడు.
ఆర్ ఆర్ ఆర్ లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్-రామ్ చరణ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 విడుదలకు సిద్ధం అవుతుంది. హృతిక్ రోషన్ మరొక హీరోగా నటించారు. అలాగే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఒక చిత్రం చేస్తున్నారు. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక రామ్ చరణ్ పెద్ది టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకుడిగా ఉన్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.