ఎంత నష్టమంటే
బార్డర్లో నెలకొన్న కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడుతోంది. అయితే ఈ వాయిదా పడటం వల్ల అటు బీసీసీఐకి.. ఇటు బ్రాడ్కాస్టర్లకు విపరీతంగా నష్టం వాటిల్లుతోంది. తూలంగా ఒక్కో మ్యాచ్ కు 60 కోట్ల చొప్పున.. వారంలో దాదాపు ఐదు నుంచి ఏడు మ్యాచ్లకు గానూ బిసిసిఐ 300 నుంచి 400 20 కోట్లు నష్టపోయింది. బ్రాడ్కాస్టర్లు 5,500 కోట్లు నష్టపోయారు. ఇక ఫారం ప్లేయర్లు వారి సొంత దేశాలకు వెళ్లిపోయారు. ఒకవేళ ఐపీఎల్ మళ్లీ మొదలైతే వారిని తిరిగి ఇండియాకు రప్పించాలి. ఒకవేళ ఇండియాకు కనుక వారు రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే.. వారి స్థానంలో ఇతర ప్లేయర్లతో ఆడించాల్సి ఉంటుంది. మొత్తంగా ముష్కర దేశం చేసిన పనికిమాలిన పని వల్ల మనదేశంలో క్రికెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. అంతటి కరోనా సమయంలోనూ ఇంతటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తలేదు. అయితే ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బీసీసీఐ ఎటువంటి ప్రయత్నం చేస్తుంది.. బ్రాడ్కాస్టర్లకు ఎటువంటి భరోసా ఇస్తుందనేది చూడాల్సి ఉంది. అయితే ముందుగానే ప్రమోటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో.. నష్టం త్వరగానే భర్తీ అవుతుందని మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రమోటర్లు.. కార్పొరేట్ కంపెనీలకు ప్రేక్షకులు మైదానాలకు వస్తేనే దండిగా ఆదాయం వస్తుంది. ప్రేక్షకులు రాకపోతే వారు మాత్రం అంతగా పెట్టుబడి ఎందుకు పెడతారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. సరిహద్దుల్లో ఇంకా అటువంటి విపత్కర పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వహణ ముందుకు సాగుతుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో మరి.
