
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కావడం లేదు. ఈరోజు ఈడీ కార్యాలయానికి సెలవు. బుద్ధపౌర్ణమి సందర్భంగా ఈడీ కార్యాలయానికి సెలవు కావడంతో పాటు మహేశ్ బాబు కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. దీంతో ఆయనకు నేడు నోటీసులు ఈడీ అధికారుల ఎదుటకు హాజరు కావడం లేదు.
విదేశాల్లో ఉన్న మహేశ్ బాబు…
హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలైన సూర్య డెవలెపర్స్ తో పాటు సురానా గ్రూపు సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించినప్పుడు దానికి ప్రకటన చేసిన మహేశ్ బాబుకు ఆరు కోట్ల రూపాయలు చెల్లించినట్లు లెక్కలు దొరకడంతో ఈడీ అధికారులు మహేశ్ బాబును విచారణకు రావాలని కోరారు.గత నెల 27, 28 తేదీల్లో తాను షూటింగ్ సమయంలో బిజీగా ఉన్నానని, మరో సమయం ఇవ్వాలని కోరగా నేటికి ఈడీ అధికారులు విచారణకు సమయం ఇచ్చారు. నేడు ఈడీ కార్యాలయానికి సెలవుతో పాటు మహేశ్ బాబు విదేశాల్లో ఉండటంతో ఆయన హాజరు అయ్యే అవకాశాలు లేవు.