
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి అందులో కొంతమందికి మాత్రమే పాన్ ఇండియా దర్శకులుగా మంచి ఇమేజ్ అయితే దక్కుతుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) సందీప్ రెడ్డివంగా (Sundeep Reddy Vanga) సుకుమార్ లాంటి దర్శకులు పాన్ ఇండియాను శాసిస్తున్న సందర్భంలో ఇకమీదట రాబోయే దర్శకులు సైతం పాన్ ఇండియా ను టార్గెట్ చేసే సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాళ్లు చేసే సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నా కూడా ఇకమీదట వాళ్ళు సాధించబోయే విజయాలు వాళ్లను ఉన్నతమైన స్థానంలో నిలిపే అవకాశమైతే ఉంది. ఈ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు (Buchhi babu) ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక తను అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే మాత్రం పెద్ది సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా బుచ్చిబాబు సైతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సుకుమార్ (Sukumar) తన మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బుచ్చిబాబు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
ఉప్పెన (Uppena) సినిమా విషయంలో కూడా సుకుమార్ ఆ సినిమాను సక్సెస్ చేయడంలో తను కూడా కీలకపాత్ర వహించాడు. ఇక దాంతోపాటుగా బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ ని కూడా తనే సెట్ చేశాడు. మరి ఈ సినిమాతో బుచ్చిబాబు భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానటువంటి ఒక గొప్ప గుర్తింపును అందుకున్న ఆయన ఇకమీదట పాన్ ఇండియాలో సుకుమార్, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల పక్కన నిలబడాలి అంటే మాత్రం ఈ సినిమా విజయం అతనికి చాలా కీలకంగా మారబోతుంది…