
ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదమూడు మంది మరణించారు. అధిక సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. ప్యాసింజర్ వాహనాన్ని ట్రక్కును ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. రాయపూర్ జిల్లా ఎస్పీ లాల్ ఉమ్మేద్ సింగ్ కథనం ప్రకారం.. ప్రయాణికులతో నిండిన వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
గాయపడిన వారిలో…
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా గుర్తించామని చెప్పారు. చౌతియాల ఛత్తిలో ఒక కార్యక్రమానికి వెళ్లి రాయపూర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. అనేక మంది ఈ ప్రమాదంలో గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలోనూ కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.