మూడు కోట్ల విలువచేసే ఏనుగు దంతాలను ఎల్బీనగర్ ఎస్వోటీ టీం, హయత్ నగర్ అటవీశాఖ అధికారులు ఎల్బీనగర్లో స్వాధీనం చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాచకొండ కమిషనర్ జి సుధీర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఇద్దరు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలు కు వెళ్లి వచ్చారని తర్వాత తొందరగా డబ్బు సంపాదించవచ్చని ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు అమ్మడానికి ప్రైవేట్ బస్సులో టీవీ కవర్ లో పెట్టుకుని తీసుకోవచ్చారని ఖచ్చితమైన సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటి టీం నిందితున్ని అరెస్టు చేసి ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
