– పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నవారే ప్రధాన లక్ష్యం
వాషింగ్టన్ : రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 1500 విద్యార్ధి వీసాలను రద్దు చేసింది. వందలాదిమంది విద్యార్ధులు, ఇటీవలే చదువు ముగిసిన గ్రాడ్యుయేట్లు వీరందరు ఈ జాబితాలో వున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రధానంగా లక్ష్యంగా మారిందెవరని పరిశీలిస్తే, పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, నిరసనల్లో పాల్గొన్న విద్యార్ధులేనని స్పష్టమవుతోంది. వీరిలో చాలామంది వీసాలు రద్దు కాగా, అనేకమందిని అరెస్టు చేశారు. గాజాపై ఇజ్రాయిల్ అత్యంత కిరాతకంగా యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో గతేడాది అమెరికా వ్యాప్తంగా పలు కాలేజీ కేంపస్‌ల్లో ఈ నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. పాలస్తీనాతో పరోక్షంగా సంబంధాలు కలిగిన వ్యక్తులు మరికొంతమంది వున్నారు. లేదా సోషల్ మీడియాలో గాజాకు మద్దతును ప్రకటించిన వారూ వున్నారు. ఈ విద్యార్ధులు కాలేజీ క్యాంపస్‌ల్లో యూదు వ్యతిరేకతను, హమాస్ భావాలను వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను విద్యార్ధులు, లాయర్లు, సామాజిక కార్యకర్తలు అందరూ తోసిపుచ్చారు. గాజాలో సాగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా అమెరికాలో జరిగిన అనేక నిరసనల్లో యూదు కార్యకర్తలు, గ్రూపులు అగ్ర భాగాన నిలిచాయి. వీసాలు రద్దైన వారిలో కొంతమంది వాహనాలు వేగంగా నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించిన వారు, ఇతర చిన్నపాటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారు కూడా వున్నారు.