
హైదరాబాద్: ఇజ్రాయెల్ నేరాలను ఆపడంలో ప్రాంతీయ ఐక్యత అవసరమని ఇరాన్ నొక్కిచెప్పింది. సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖాలిద్ బిన్ సల్మాన్ గురువారం ఇరాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీలను కలిశారు. ఇరుదేశాల అధినేతల ఉన్నతస్థాయి సమావేశం జరిగిది.ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు పరస్పర ప్రయోజనకరంగా ఉండాలని ఖమేనీ ఆకాంక్షించారు. సౌదీ అరేబియాతో సాంకేతిక రంగాలలో పురోగతిని పంచుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పెజెష్కియాన్ నొక్కిచెప్పారు. సౌదీ అరేబియా, ఇరాన్ పశ్చిమ ఆసియా ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.రెండు దేశాలు రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవహారాలపై సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ట్రేడ్ వార్ ఆంక్షలతో రక్కెలేస్తున్న ట్రంప్..అదే తరహలో ఇరాన్ అణు ఒప్పందానికి ముందుకు రాకపోతే..క్షిపణుల దాడి చేస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. అదే స్థాయిలో అమెరికా దాడులను తిప్పికొడతామని ట్రంప్‌కు ధీటుగా ప్రతిజవాబు యిచ్చారు ఇరాన్ అధ్యక్షుడు ఖమేలి. ఈక్రమంలో పొరుగుదేశాలతో సఖ్యత కుదుర్చుకోవడానికి ఇరాన్ పావులు కలుపుతున్నంది. ఆయా దేశాల్లో పర్యటిస్తూ ఇరాన్ కీలక ఒప్పందాలు చేసుకుంటుంది.