వాటికన్ సిటీ : కేథలిక్స్ చర్చి మత పెద్దగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పోప్ ఫ్రాన్సిన్ సాధారణమైన పోప్ పోకడలకు భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చారు. చర్చి లోపలి సాంప్రదాయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఆయన తన ధోరణిని మార్చుకోలేదు. పలు సామాజిక అంశాలపై, సమస్యలపై ఆయన తన గళాన్ని వినిపించారు. దీంతో రాడికల్ పోప్‌గా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం అహర్నిశలు పాటు పడ్డారు. లాటిన్ అమెరికాకు చెందిన తొలి పోప్‌గా ఆయన తొలినాళ్ళ నుండి బాధాతప్తులకు బాసటగా నిలుస్తూ వచ్చారు. శరణార్ధులు, వాతావరణ మార్పులతో పోరాటం చేస్తున్న దేశాలకు అండగా నిలిచారు. మానవాళి సృష్టిస్తున్న ఈ వాతావరణ సంక్షోభానికి ప్రజలే బలవుతారని ఆయన హెచ్చరించారు. బిషప్‌లు, మతాధిపతులు లైంగిక నేరాలకు పాల్పడిన ఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 2013 మార్చిలో పోప్‌గా ఎన్నికైన నాటి నుండి కేథలిక్ చర్చి నాయకుడిగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. జార్జి మారియో బెర్గోయిగ్లో పోప్‌గా మారిన తర్వాత 13వ శతాబ్దానికి చెందిన ఆథ్యాత్మికవేత్త, నిరుపేదల కోసం తన సంపదను, జీవితాన్ని అంకితం చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ పేరులోని ఫ్రాన్సిస్‌ను తీసుకుని పోప్ ఫ్రాన్సిస్గా ప్రసిద్ధులయ్యారు. విలాసవంతమైన రాజభవనాలు విడిచిపెట్టి, సామాన్యమైన దుస్తులు ధరించి అత్యంత వినయంతో ప్రజల్లో మెలిగేవారు. వితంతువులు, అత్యాచార బాధితులు, ఖైదీలు ఇలాంటి వారికి తరచుగా ఫోన్ కాల్స్ చేసి మాట్లాడేవారు. తన పూర్వీకుల కన్నా మరింతగా ప్రజలకు అందుబాటులో వుండేవారు. సోషల్ మీడియా నుండి పోర్నోగ్రఫీ (అశ్లీ సాహిత్యం) వరకు అనేక అంశాలపై యువతతో మాట్లాడేవారు. తన ఆరోగ్యం గురించి కూడా ఎలాంటి దాపరికం లేకుండా పంచుకున్నారు. మోకాళ్ళ నొప్పులతో ఆయన చివరి కాలంలో వీల్ ఛెయిర్‌కే అంకితమయ్యారు.
ఖైదీల పాదాలకు ముద్దు పెట్టి…
వాటికన్లో మొదటి ఈస్టర్కు ముందుగా, పోప్ రోమ్ జైల్లోని ఖైదీల పాదాలను కడిగి, ముద్దు పెట్టుకున్నారు. తన పూర్వీకులకు లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరి ఆదరాభిమానాలు అందుకోవడానికి ఆయనలోని ఇలాంటి గుణాలే కారణాలుగా వున్నాయి. మొట్టమొదటి విదేవీ పర్యటనకు గానూ ఆయన ఇటలీ ద్వీపకల్పమైన లాంపెడుసాను ఎంచుకున్నారు. యూరప్‌కు చేరుకోవాలని ఆశించే వేలాదిమంది శరణార్ధులు ప్రవేశించే పాయింట్ ఇదే. ప్రపంచీకరణ ఉదాసీనతను ఆయన నిందించారు.
ట్రంప్ చర్యలను ఖండించి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి పదవీ హయాంలో మెక్సికోకు వ్యతిరేకంగా సరిహద్దు గోడను నిర్మించడాన్ని పోప్ తీవ్రంగా విమర్శించారు. క్రైస్తవ విరుద్ధమైన చర్య అని ఖండించారు. ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత కూడా ఆయన శరణార్ధులను అమానవీయంగా తరలించడాన్ని తీవ్రంగా నిరసించారు. ఇదొక ప్రధానమైన సంక్షోభంగా మారుతుందని, అత్యంత దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించారు.
2016లో యూరప్ శరణార్ధుల సంక్షోభం తీవ్రంగా వున్న రోజుల్లో, పోప్ ఫ్రాన్సిస్ గ్రీక్ ద్వీపమైన లెస్బాస్కు వెళ్ళి ఆశ్రయం కోరుతున్న సిరియా ముస్లిమ్‌లకు చెందిన మూడు కుటుంబాలను తీసుకుని రోమ్ తిరిగి వచ్చారు. మతాల మధ్య సయోధ్యకు ఆయన కట్టుబడ్డారు. ఇతర భిన్నమైన మార్గాల్లో వాటికన్ దౌత్యానికి జవసత్వాలు ఇచ్చారు. అమెరికా, క్యూబాల మధ్య చారిత్రక సయోధ్యకు వెసులుబాటు కల్పించేందుకు సాయపడ్డారు. కొలంబియాలో శాంతి ప్రక్రియను ప్రోత్సహించారు.
వాతావరణ మార్పులపై గళమెత్తి
చారిత్రక 2015 పారిస్వాతావరణ ఒప్పందాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్‌ను నిపుణులు పేర్కొంటారు. వాతావరణ మార్పులపై సత్వర కార్యాచరణ చేపట్టాలని ఆయన నిరంతరం విజ్ఞప్తి చేస్తూండేవారు. ముంచుకొస్తున్న ఈ పర్యావరణ విపత్తుకు సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు, వారి విధానాలే కారణమని వాదించేవారు. ఇప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని అంటూ ఇక ఆలస్యం చేయరాదని, వెంటనే కళ్ళు తెరవాలని 2023లో ఆయన ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు.
శాంతి కాముకుడు
శాంతి కాముకుడైన పోప్ తరుచూ ఆయుధాల తయారీదారులను నిరసించేవారు. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు, యుద్ధాలతో అతలాకుతలమవుతున్న నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్ సహా ప్రపంచంలో యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలలో శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘పోరాటం చేస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాల్పుల విరమణ జరపండి, బందీలను విడుదల చేయండి. శాంతి, భవిష్యత్తును కోరుకుంటూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు సాయం చేయండి. వలసవాదులు, అణగారిన ప్రజల పట్ల కరుణ చూపండి.’ అని విజ్ఞప్తి చేశారు.పోప్ బాధ్యతలు చేపట్టేనాటికి అప్పటికే కుంభకోణాలు చుట్టుముట్టిన కేథలిక్ చర్చి వైఖరులను మార్చడంలో, దూరంగా జరిగిన విశ్వాసపరులను తిరిగి వెనక్కి తెచ్చుకోవడంలో పోప్‌కే ఘనతనివ్వాలని ఆయన అభిమానులు పేర్కొంటారు. గే కేథలిక్స్ గురించి మాట్లాడమంటే ‘నేనెవరిని అంచనా వేయడానికి?’ అని ఎదురు ప్రశ్నించారు. మతాధిపతుల లైంగిక దాడుల అభియోగాల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడానికి ఆయన తనవంతుగా ప్రయత్నించారు. బాధితులను కలుసుకున్నారు. అందుకు బాధ్యులైనవారిని జవాబుదారీ చేస్తామని హామీ ఇచ్చారు.
తదుపరి పోప్ ఎన్నిక
పోప్ మరణిస్తే కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి రోమన్ కేథలిక్ చర్చికి ఒక విస్తృతమైన విధానం వుంది. పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు చర్చి ‘ఖాళీ స్థానం లేదా ఖాళీ చేసిన స్థానం’ అనే స్థితికి చేరుతుంది. సెయింట్ పీటర్ సింహాసనం ఖాళీ అయినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. ఆ సమయంలో దివంగత పోప్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. అనంతరం కొత్త పోప్‌ను ఎన్నుకోవడాడానికి కార్డినల్స్ సమావేశమవుతారు. పోప్ స్థానం ఖాళీ అయిన 15-20 రోజుల మధ్య ఈ సమావేశం జరుగుతుంది.