
మున్సిపాలిటీలతోపాటు అన్ని మండల కేంద్రాలలో మూడవ శనివారం చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం పై కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈఓఆర్డీలతో కలెక్టర్ గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో 13 శాఖలు భాగస్వామ్యం కావాలన్నారు.