
ప్రధానిని కలిసి కృతజ్ఞతలు చెప్పిన దావూదీ బొహ్రా ముస్లింలు
దిల్లీ: వక్స్ (సవరణ) చట్టం చేసినందుకు ప్రధాని మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ధన్య వాదాలు తెలిపారు. సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తంచేశారు. వీరు గురువారం ప్రధానిని కలి శారు. షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు జనాభాపరంగా మైనారిటీలు. ఆర్థికంగా వీరు బలమైన వర్గం. వక్స్ బిల్లుపై ఏర్పడిన పార్ల మెంటరీ సంయుక్త కమిటీకి గతంలో దావూదీ బొహ్రాలు తమ సిఫారసులను సమర్పించారు. వీటి ఆధారంగా చట్టంలో ప్రభుత్వం కొన్ని సవ రణలను చేసింది. “దావూదీ బొహ్రా సమాజానికి చెందిన సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగింది. అనేక అంశాలపై పరస్పరం అభిప్రా యాలను పంచుకున్నాం” అని ‘ఎక్స్’ వేదికగా మోదీ పేర్కొన్నారు.