
యూత్ ఫుల్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కెరీర్లో మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల మాస్ సినిమాల వెంట పయనించిన రామ్, ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పి. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటిస్తున్న కొత్త సినిమా RAPO22 పైనే మంచి హైప్ ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఇందులో రామ్ సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్ లుక్స్‌లో రామ్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఒకవైపు ప్రేమ, మరోవైపు మెలో డ్రామా టచ్‌తో కూడిన ఈ సినిమా కంటెంట్ కొత్తగా ఉండబోతోందని సమాచారం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొదటి రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న టీం, రిచ్ విజువల్స్‌తో సినిమా రూపుదిద్దుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కథ, కథనాల్లో కొత్తదనం కనపడేలా దర్శకుడు పి. మహేష్ బాబు సినిమా తీర్చిదిద్దుతున్నాడని టాక్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రామ్ నటిస్తున్న RAPO22 సినిమా ఈ దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది. దీపావళి పండగ సందర్భంగా విడుదల కావడం సినిమాకు అదనపు బెనిఫిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీజన్లో ప్రేక్షకులకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందితే ఆ కిక్కే వేరు. ఇక ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కథ మలిచారని సమాచారం. దీంతో ఈ ఫెస్టివ్ సీజన్లో RAPO22 మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
ఈ సినిమాలో భగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకమైన భాగం అని చెబుతున్నారు. ఇక సీనియర్ నటులు రావు రమేష్, మురళీ శర్మ, కమెడియన్లు సత్య, రాహుల్ రామకృష్ణ వంటి వారు సినిమాలో ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. వీరందరి కాంబినేషన్ సినిమా ఆకర్షణను మరింత పెంచనుంది వివేక్-మెర్విన్ కంపోజ్ చేస్తున్న సంగీతం కూడా సినిమాకు స్పెషల్ హైప్ తెచ్చేలా ఉండబోతోందని యూనిట్ అంటోంది.
దీపావళికి విడుదల కాబోతున్న RAPO22 సినిమాపై ఇప్పుడే మంచి బజ్ మొదలైంది. రామ్ ఈ సినిమాతో మళ్లీ తన లవర్ బోయ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. మాస్ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సినిమా కంటెంట్ ఉందని సమాచారం. మరి ఈ దీపావళి కి రామ్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.