జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణం అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మధ్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్‌ను జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని సీబీఐ, ఈడీలను రంగంలోకి దింపాలని కోరారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరక మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యంతో పేదల ప్రాణాలు తీయడం క్షమించరాని నేరమని సోమిరెడ్డి దుయ్యబట్టారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ, “డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంతంటే, 3200 కోట్లు కాదు, 10,000 కోట్లకు పైనే. గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సద్దల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగాను, ‘ఏందయ్యా, మీ డిస్టిలరీల మీద వాళ్లు పెత్తనం చేస్తున్నారు అంటే?’ అని. అప్పుడు ఆయన, ‘మా ఎస్పీ వై ఇండస్ట్రీ, మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ, మిధి రెడ్డి చేతిలోకి వెళ్లిపోయింది’ అని నాకు చెప్పాడు. స్వయంగా ఆయన ఈ రోజు అరెస్ట్ అయ్యాడు. ఆఖరికి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీకి సంబంధించిన మక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది. మక్డవల్ కంపెనీ, ‘మీరు అడిగిన లంచాలు మేము ఇవ్వలేము’ అంటే, ‘మూసేయండి నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. మేము తయారు చేసిన మద్యం అమ్మండి, అది తాగి చావండి’ అన్నట్లు చేశారు. ఈ డెమోక్రసీలో అసలు ప్రజాస్వామ్యం బతికిందా? గత ఐదేళ్లలో వాళ్లు, ‘మాకు డబ్బు ఉంటే చాలు’ అనుకున్నారు. నేనేమంటాను? మనుషుల ప్రాణాలు తీసే హక్కు నీకు ఎక్కడిది? ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ కుంభకోణం. ఇంటర్నేషనల్ యోగులు డబ్బులు పెరుక్కున్నారు, ప్రాణాలు పెరుక్కున్నారు. అందుకే ఇది ఆశామాషీ విషయం కాదు. సీరియస్‌గా తీసుకోవాలి. ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. స్కామ్‌పై వెంటనే ఈడీ, సీబీఐ అందరూ ఎంటర్ అయిపోవాలి. బిగ్ బాస్ దురాశ వల్ల ఇది జరిగింది. ఆ ఫ్యామిలీ వల్ల వాళ్లు కటకటాల లెక్క పెట్టక తప్పదు. పేదోళ్ల ప్రాణాలను పణంగా పెట్టి నీవు వేల కోట్లు సంపాదించుకున్నావు” అని ఆయన అన్నారు.
