పెహల్గామ్ దాడితో పాకిస్థాన్‌కు లింకున్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. ఇవాళ పాకిస్థాన్ సేనేట్‌లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తమ దేశంపై ఆరోపణలు చేయడాన్ని భారత్ ఆపాలని నేషనల్ సెక్యూర్టీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని తీర్మానంలో పేర్కొన్నారు. డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ ఆ తీర్మానం ప్రవేశపెట్టారు. పాకిస్థాన్ పూర్తి సామర్థ్యంతో ఉన్నదని, తమ నేలను కాపాడేకునేందుకు సిద్ధంగా ఉందని, జల ఉగ్రవాదమైనా, సైనిక కవ్వింపు అయినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు దార్ తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీయడం పాకిస్థాన్ విలువలకు వ్యతిరేకమని సేనేట్ తన తీర్మానంలో పేర్కొన్నది.సింధూ జలాలా ఒప్పందాన్ని సస్పెండ్ చేయడాన్ని కూడా సేనేట్ వ్యతిరేకించింది.పాకిస్థాన్‌తో పాటు విదేశీ గడ్డలపై భారత్ అనేక రకాల ఉగ్రవాదానికి పాల్పడిందని, దానికి ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుందని తీర్మానంలో డిమాండ్ చేశారు.
