
- అధిక లాభాలంటూ ఆశ చూపిన కేటుగాళ్ళు
- దాదాపు రూ.13 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిన బాధితులు
- ఆన్లైన్ వెబ్ సైట్ ఎత్తేయటంతో బట్టబయలు
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
అధిక లాభాలని ఆశ చూపి, ఆన్లైన్ కంపెనీ పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి నిందితులు పత్తా లేకుండా పోవడంతో బాధితులు మం గళవారం కీసర పోలీసులను ఆశ్రయించారు. బాధితుల వివరాల ప్రకారం. గత కొన్ని రోజులుగా కీసరలో నివ సిస్తున్న నాగుల నర్సింహా స్వామి కరీంనగర్ కు చెందిన గట్టు కుమారస్వామితో కలిసి దమ్మాయిగూడలోని పద్మశాలి కాలనీలో కార్యాలయం ఏర్పాటు చేశారు.లెకా బిట్ కాయిన్ స్కీమ్ పే రిట ఆన్లైన్ వెబ్ సైట్ ప్రార ంభించారు. దమ్మాయిగూడ తో పాటు కీసరలోని పలువు రికి రూ.10 వేల పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.30 వేల లాభం వస్తుందని ఆశ చూ పారు. దీంతో పలువురు అధిక లాభాలను నమ్మి ఒక్కొ క్కరు రూ.10 వేల నుంచి రూ. లక్షల్లో పెట్టుబడులు పె ట్టారు. దమ్మాయిగూడలోనే దాదాపు రూ.13 కోట్ల వర కు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. ఉన్నట్టుండి ఆన్ లైన్ వెబ్ సైట్ ఎత్తేయటంతో మంగళవారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కీసరకు చెందిన రాగుల శ్రీరంగం దాదాపు రూ.11 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ విషయమై కీసర సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ లేకా బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.