
ఆ ఐదు రోజుల ముందే బయలుదేరిన సూర్యాపేట రైతులు • యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట,: కేసీఆర్పై కొండంత అభిమానంతో పాటు సాహసోపేతమైన యాత్రగా ఎడ్లబండ్లలో వరంగల్ వెళ్ళడం హర్షణీయ మని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మతల్లి దేవాలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించి మాట్లాడారు. 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25 లో అడుగుపెడుతున్న బిఆర్ఎస్ పార్టీ సభకు సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా వుందన్నారు. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతుందన్నారు. బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అందుకే కెసిఆర్ మీద అభి మానంతో బిఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయలుదేరినట్లు చెప్పారు. ఎల్కతుర్తి మట్టిని తాకి, రజతోత్సవ సభను తిలకించి కేసీఆర్ మాటలు వినాలన్న రైతుల తపన ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, నాయకులు వై వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నెమ్మది బిక్షం, జీడి బిక్షం, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, జీవన్ రెడ్డి, గుర్రం సత్యనారాయణ రెడ్డి, కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్న గౌడ్, తూడి నర్సింహ రావు, కొణతం సత్యనారా యణ రెడ్డి, కొండ మధు, కసగాని బ్రహ్మం గౌడ్, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు.