వాషింగ్టన్ : అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌పై డోనాల్ట్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చైనాతో సానుకూల చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. ట్రంప్ టారిఫ్ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జెరోమ్ పావెల్‌ను పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్టు ట్రంప్ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ఇతర సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నప్పటికీ తాను అనుకున్న విధంగా యూఎస్ ఫెడ్ వేగంగా రేట్లను తగ్గించడం లేదని గురువారం పేర్కొన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఎప్పుడో రేట్లు తగ్గించిందన్నారు. ఇకనైనా పావెల్ రేట్ల కోత చేపట్టాలన్నారు. 2026 చివరి వరకు పావెల్ పదవీ కాలం ఉంది. ఆయనను 2017లో ట్రంప్ నియమించారు. తర్వాత 2022లో పావెల్ పదవీకాలాన్ని బైడెన్ నాలుగేండ్ల పాటు పొడిగించారు.
ట్రంప్ వాణిజ్య విధానాలతో అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని జోరోమ్ పావెల్ ఇంతక్రితం రోజు అన్నారు. తమ అధ్యక్షుడు ట్రంప్ అవలంభిస్తోన్న అధిక టారిఫ్‌ల విధానంతో అమెరికాకు తీవ్ర ముప్పేనని అన్నారు. ట్రంప్ యంత్రాంగం ఇప్పటి వరకూ ప్రకటించిన సుంకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు తమ కేంద్ర బ్యాంక్‌ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని పావెల్ అన్నారు. పావెల్ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని ట్రంప్ పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేయడం గమనార్హం.
తలొగ్గుతున్న ట్రంప్
అమెరికా, చైనా మధ్య తీవ్ర వాణిజ్య యుద్ధం నడుస్తోన్న వేళ ట్రంప్ తన నిర్ణయాలపై క్రమంగా తలొగ్గుతున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలపై వేసిన అధిక సుంకాలను తాత్కాలికంగా 90 రోజుల పాటు నిలిపివేయగా.. చైనాపై మాత్రం తన దాడిని కొనసాగించారు. తాజాగా చైనా అంశంలోనూ నెమ్మదిస్తోన్నట్లు సంకేతాలు ఇచ్చారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలో మంచి ఒప్పందం చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో సమావేశం సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా వస్తువులపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. చైనా కూడా అంతే దీటుగా యూఎస్‌పై సుంకాలు పెంచింది. ట్రంప్ చర్యలపై స్వయంగా ఆ సొంత దేశం పౌరుల నుంచే నిరసనలు వ్యక్తం కావడం, మాంద్యం ముదురొచ్చనే అంచనాల్లో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తోంది. సుంకాల సమస్యను పరిష్కరించాలనుకుంటే గౌరవం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా చర్చలు జరపాలని చైనా డిమాండ్ చేస్తోంది. అదే విధంగా అమెరికా క్యాబినెట్ సభ్యులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. వాణిజ్య విషయాలపై యూఎస్ స్థిరమైన వైఖరిని అవలంబించాలని.. పలు అమెరికా ఆంక్షలు, తైవాన్‌పై అమెరికా విధానం గురించి తమ ఆందోళనలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. ట్రంప్ నుంచి స్పష్టమైన మద్దతు పొందిన ఒక ముఖ్యమైన చర్చల ప్రతినిధిని నియమించాలని చైనా కోరింది. ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇద్దరూ అధికారికంగా సంతకం చేయగల ఒప్పందాన్ని రూపొందించ గల సమర్థ వ్యక్తి అయి ఉండాలని సూచించింది.