
ప్రధానమంత్రి పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. సభా వేదిక వెనుక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించి ప్రధాని పర్యటనపై ఏర్పాట్లను సమీక్షించింది. రేపు సాయంత్రం ప్రధాని మోదీ అమరావతికి వస్తుండటంతో పర్యవేక్షణ అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న మంత్రులు అనేక విషయాలపై చర్చించారు.
మంత్రుల కమిటీతో…
ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో, శంకుస్థాపనలు అనంతరం బహిరంగ సభ వంటి విషయాలపై మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని రూపొందించుకుని ఆ దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సభకు చేరుకునే మార్గాలు,పార్కింగ్ స్థలాలు,ఆహారం,తాగునీరు,వేదిక వద్ద ఏర్పాట్లు,భద్రతా ఏర్పాట్లు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ,కేశవ్,కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.