
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా నమ్మకం పెట్టుకుని చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. డిజాస్టర్‌గా నిలిచిన ఆ సినిమా కంటే ముందు పూరి నుంచి వచ్చిన లైగర్ కూడా నిరాశ పరచిన విషయం తెల్సిందే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి కెరీర్ గాడిలో పడ్డట్లే అనుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో పూరి సినీ కెరీర్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆయన తిరిగి కోలుకుంటాడా, ఆయన దర్శకత్వంలో నటించేందుకు హీరోలు సిద్ధంగా ఉన్నారా అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. పూరి విమర్శలు, ట్రోల్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ తదుపరి సినిమాకు రెడీ అయ్యాడు.
పూరి తదుపరి సినిమా తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో అని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. బెగ్గర్ అనే విభిన్నమైన టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టేలు నటించబోతున్నారు. విజయ్ సేతుపతికి జోడీగా రాధిక ఆప్టే కనిపించబోతుంది. కీలక పాత్రలో టబు కనిపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయని, షెడ్యూల్ మొదలు పెడితే షూటింగ్ పూర్తి అయ్యే వరకు కంటిన్యూగా చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.
సినిమా మొత్తాన్ని రెండు షెడ్యూల్స్‌లో కేవలం 60 డేస్‌లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమా బడ్జెట్‌ను పరిధిలో పెట్టుకుని, డేట్లు ఎక్కువ తీసుకోకుండా 60 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలని భావించడం ద్వారా పూరి తన పూర్వ వైభవం కి రావడం ఖాయం అనే అభిప్రాయంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పూరి తన సినిమాలను మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసేవాడు. రాజమౌళి వంటి వారు సైతం పూరి స్పీడ్ మేకింగ్ అంటే ఇష్టం అని చెప్పారు. మహేష్ బాబు బిజినెస్మెన్ సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి అరుదైన రికార్డ్‌ను పూరి జగన్నాధ్ అందుకున్న విషయం తెల్సిందే.
విజయ్ దేవరకొండ విలక్షణమైన నటనతో మెప్పిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈయనకు మంచి పేరు వచ్చింది. అందుకే ఈయన హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా అనగానే చాలా మందికి పాజిటివ్ ఒపీనియన్ కలిగింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది. మొత్తానికి పూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా 60 రోజుల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి కనుక విడుదల కూడా మరీ ఎక్కువ దూరం లేకుండా ఇదే ఏడాదిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. విజయ్ మరో వైపు తమిళనాట పలు సినిమాలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటే పూరి మరి కొన్నాళ్ల పాటు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి.