తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి లక్కీ ఛాన్స్ దక్కింది. బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఈ ఏడాదికి బీసీసీఐ మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో ఎంపిక చేసింది. బీసీసీఐ కాంట్రాక్టు దక్కితేచాలు ఇక లైఫ్ సగం సెటిల్ అయినట్లేనని భావిస్తారు. బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్టును కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకు తిరిగి అవకాశం దక్కింది.
ఏడాదికి కోటి…
టీ 20లలో కీలకంగా మారిన వారిని కూడా బీసీసీఐ కాంట్రాక్టుకు ఎంపిక చేసింది. రింకూసింగ్, శివమ్ దూబె, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూశాంసన్, ఆర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజిత్ పాటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్,నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. వీరికి ఏడాదికి బీసీసీఐ కోటి రూపాయలు చెల్లించనుంది.
