
నేడు నిజామాబాద్ లో రైతు మహోత్సవం జరుగుతుంది. అయితే ముగ్గురు మంత్రులు ఈ కార్యక్రమానికి హెలికాప్టర్ లో వచ్చారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో తలెత్తిన సమన్వయ లోపం కారణంగా సభ జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోకి హెలికాప్టర్ రావడంతో రైతు మహోత్సవ సభ కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫ్లెక్సీలు దెబ్బతిన్నాయి. షామియానాలు కూడా కింద పడ్డాయి.
హెలికాప్టర్ కిందకు రావడంతో…
హెలికాప్టర్ కిందకు రావడంతో ఒక్కసారిగా దుమ్ము రేగడంతో రైతు మహోత్సవానికి వచ్చిన ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. హెలిప్యాడ్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినప్పటికీ అధికారుల సమన్వయ లోపం కారణంగానే పైలెట్ రైతు మహోత్సవం జరిగే ప్రాంతానికి తీసుకు రావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్ లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న రైతు మహోత్సవం కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు.