
సినిమాల ఫలితాల మీద రివ్యూల ఎఫెక్ట్ ఎంత అనే డిస్కషన్ పెడితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. కొందరు సినిమాలో స్టఫ్ ఉంటే రివ్యూస్ ఎలా ఉన్నా చూస్తారని అంటుంటే సినిమాలు రివ్యూస్ వల్ల ఆడట్లేదన్న వారు ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువగా రివ్యూస్ వల్ల సినిమాలు సరిగా ఆడట్లేదన్న వాదనే ఎక్కువ వినిపిస్తుంది. ఒక సినిమా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయితే అది ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్ అని చెప్పడానికి ముందు రివ్యూస్ బ్యాడ్ గా రాయడం వల్లే సినిమా పోయిందని అంటుంటారు.
రివ్యూస్ మీద బడా నిర్మాతలు, స్టార్ హీరోలు ఇలా అందరు ఏదో ఒక సందర్భంలో తమ అసంతృప్తిని వ్యక్త పరిచారు. ఐతే కొత్తగా సినిమా రివ్యూస్ మీద న్యాచురల్ స్టార్ నాని ఒక క్రేజీ పాయింట్ చెప్పాడు. అంతేకాదు సినిమాలు ఆడియన్స్ చూడట్లేదు అంటే అది కచ్చితంగా మేకర్స్ తప్పే కానీ ప్రేక్షకులది కాదని అంటున్నాడు నాని.
సినిమాను ఆడియన్స్ చూడట్లేదు అంటే అది వాళ్ల తప్పు కాదు. అది పూర్తిగా ఆ సినిమా మేకర్స్ యొక్క వైఫల్యమే అంటున్నాడు నాని. మంచి కంటెంట్ తో వస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేందుకు సిద్ధంగా ఉంటారని అన్నాడు. హిట్ 3 ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో నాని ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న ఇష్యూ మీద స్పందించాడు. అలా అంటే తనకు కోపం వస్తుందని అన్నాడు నాని.
ఆడియన్స్ థియేటర్స్ కి రావట్లేదు అంటే అది వాళ్ల తప్పు కాదు మనదే అన్నాడు నాని. సినిమా బాగుంటే ఇంట్లో ఎవరు కూర్చోరని.. సినిమా బాగా తీయడం అన్నది మన బాధ్యత అని అంటున్నాడు నాని. పనిలో పనిగా ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లోనే నాని సినిమా లీక్స్ గురించి కూడా స్పందించాడు.
సినిమాపై ఆసక్తి కలిగేలా లీక్స్ ఇవ్వాలి. అంతేకానీ సినిమాకు కీలకమైన విషయాలను మీడియా ముందే లీక్ చేస్తే అది సినిమా మీద ఎఫెక్ట్ చేస్తుందని అన్నాడు. చెప్పీ చెప్పకుండా ఏం చెప్పినా మాకు ఓకే అని అన్నాడు నాని. హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న నాని సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మే 1న రిలీజ్ అవుతున్న నాని హిట్ 3 సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.