
యూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `రాబిన్ హుడ్` తో కలిపి ప్లాప్ ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసాడు. చేతిలో ఛాన్సులున్నా? వియాలు లేకపోవడంతో సక్సెస్ అత్యంత అనివార్యమైంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకూ పెద్దగా హైలైట్ చేయలేదు.
షూటింగ్ అప్ డేట్ ఏదీ వెల్లడించలేదు. దీంతో `తమ్ముడు` రిలీజ్ పై రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయాలా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. చిత్రాన్ని జులై 4న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారుట. చిత్రీకరణ ఓ కొలక్కి వచ్చిందని….పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలిసింది.
సినిమా స్టోరీ లైన్ ఇప్పటికే లీకైంది. అక్కా-తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న కథ ఇది. అయితే ఇదే కథకు క్రీడా అంశాలు కూడా ముడిపెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో నితిన్ అర్చరీ ఆటగాడి పాత్ర పోషిస్తున్నాడుట. ఆ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటున్నారు. ఫ్యామిలీ బాండింగ్ తో ఈ క్రీడను ముడిపెట్టి ఆసక్తికర కథనంతో సాగుతుందంటున్నారు. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో నితిన్ చేస్తోన్న రెండవ చిత్రమిది.
కెరీర్ ఆరంభంలో రాజమౌళి దర్శకత్వంలో `సై` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందులో నితిన్ రగ్బీ ప్లేయర్ గా కనిపిస్తాడు. రౌడీయిజం నేపథ్యానికి రగ్బీ ఆటను ముడి పెట్టి జక్కన్న చేసిన చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నితిన్ కెరీర్ లోనే ఇదో మైల్ స్టోన్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలేదు. దీంతో `తమ్ముడి`పై మంచి బజ్ క్రియేట్ అవుతుంది.