బోధన్, ఏప్రిల్ 22 : బోధన్ పట్టణంలో డాగ్ స్క్వార్డ్స్ తో తనిఖీలు చేప ట్టారు. యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ నిర్మూణలలో భాగంగా మంగళ వారం పట్టణంలోని బస్ స్టాండ్, ఆటో స్టాండ్, శక్కర్ నగర్ ఏరియా హెూటళ్ళు, పాన్ షాపులు కాలేజీల ను డాగ్ స్క్వార్డ్స్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిజామా బాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా బోధన్ పట్టణంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ పై అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పట్టణంలో తనిఖీ లు చేపట్టడం జరిగిందని పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.
