
డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్‌పై రోజురోజుకు ఎదురు దాడి పెరుగుతుంది. అమెరికా ప్రతీకార సుంకాలకు అదరం, బెదరమని చైనా, కెనడా టారిఫ్ ఆంక్షలకు ప్రతిదాడికి దిగిన విషయం తెలిసిందే. యూఎస్‌కు కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించగా, అమెరికాకు చెందిన ఆటో మొబైల్ రంగాలపై దిగుమతులపై కెనడా కూడా 25శాతం సుంకాలు విధించింది. తాజాగా ఆదేశాల బాటలో జర్మనీలోని ఓ డెలివరీ సంస్థలో కీలక నిర్ణయం తీసుకుంది.కొరియర్ సేవల దిగ్గజం డీహెచ్ఎల్ 800 డాలర్ల కంటే విలువైన ప్యాకేజీలను అమెరికాలో డెలివరీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌లు, చెకింగ్లు కఠినం కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఇక బిజినెస్ టూ బిజినెస్ షిప్మెంట్లు మాత్రం కొనసాగుతాయని.. కాకపోతే వాటిల్లో కూడా ఆలస్యం చోటు చేసుకోవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా గత వారం హాంకాంగ్ పోస్టు కూడా అమెరికాకు సముద్ర మార్గాన ప్యాకేజీల సరఫరాను ఏప్రిల్ 27 నుంచి పంపడం ఆపేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాకు పార్శిళ్లను ఇక తీసుకోమన్నారు. అమెరికా అకారణంగా వేధిస్తోందని ఆరోపించింది.