జమ్మూకాశ్మీర్ లో భయానక పరిస్థితులు నెలకొనడంతో పర్యాటకులు తిరుగు ప్రయాణమవుతున్నారు. జమ్మూకాశ్మీర్ కు వచ్చిన పర్యాటకులు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఇంకా యాభై ఆరు మంది విదేశీ ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు రాష్ట్రంలో అన్ని చోట్ల జల్లడె పడుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది లష్కరే తోయిబాబకు చెందిన ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారని కేంద్ర నిఘా సంస్థలు కూడా చెబుతున్నాయి.
రాష్ట్రాన్ని వదలి వెళ్లిపోతూ…
స్థానిక ఉగ్రవాదులతో కలిసి మరిన్ని దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో టూరిస్టులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. కేవలం ఆరు గంటల్లోనే మూడు వేల మూడు వేల మంది పర్యాటకులు రాష్ట్రాన్ని వదలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నిన్న జరిగిన ఘటనతో పర్యాటకుల పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
