స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బు వసూల కేసులో వైసపి నేత మాజీ మంత్రి విడతల రజిని మరిది గోపీనాథ్ కు, కోర్టు రిమాండ్ విధించింది.
రజని మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని చిలకలూరిపేట షాడో ఎమ్మెల్యేగా భూ వివాదాలు సెటిల్మెంట్లతో గోపీనాథ్ చెలరేగారు, ప్రతి అంశంలోనూ తలదూర్చి ఐదేళ్లలో కోర్ట్‌కు పడగలెత్తారు, వైసపి హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజని మరిది గోపీనాథ్ అధికార అండతో, చేసిన అరాచకాలు అక్రమాలు అన్ని ఇన్నికావు, చిలకలూరి పేటలో అప్పటి అధికార యంత్రంగాన్ని గుప్పిట పెట్టుకొని, అన్ని తానై వ్యవహరించారు, పురుషోత్తమపట్ణం కేంద్రంగా అనుయాయులతో దందాలు దౌర్జన్యాలు అక్రమ వసూళ్లకు తెగబడ్డారు.
ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ నిర్వాహకులు తెలుగుదేశం సానుభూతిపరులు కావడంతో ఆయనపై రజిని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు, పిఏ రామకృష్ణ ద్వారా నిర్వాహకులని పిలిపించుకొని 5 కోట్లు డిమాండ్ చేశారు, మైనింగ్ విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించి కొన్నాళ్ళు క్రషర్ మూసి వేయించారు, క్రషర్ తెరిపించుకునేందుకు బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు మంత్రి రజని ఆమె మరిది గోపితో మాట్లాడారు
.రెండు కోట్లు ఇస్తే కేసులు లేకుండా చూస్తామని గోపి వారికి హామె ఇచ్చారు, ఇందుకు గోపికి 10 లక్షలు విజిలెన్స్ ఎస్పి జాషువాకు 10 లక్షలు కలిపి 2కోట్ల 20 లక్షలు వసూలు చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రషర్ నిర్వాహకులు ఏసబి కి ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయింది.
రజిని మంత్రయ్యాక నియోజక వర్గానికి అంతగా సమయం ఇవ్వలేదు ఇదే అదునుగా గోపి షాడో ఎమ్మెల్యే గా చెలరేగారు, పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నవారు ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే, బెదిరించి తక్కువ ధరకే కొనుగోలు చేసి, వాటిని అధిక ధరలకు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా వెంచర్ వియ్యాలన్నా అపార్ట్మెంట్ నిర్మించారన్నా గోపికి కప్పం కట్టాల్సిందే అనేంతగా వసూళ్లకు తెగబడ్డారు, జగనన్న కారణీల కోసం పశుమర్రులోని రైతుల నుంచి భూములని సేకరించారు, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే మార్కెట్ ధర తక్కువగా ఉండడంతో, రైతులు భూములు ఇవ్వడానికి పోటీ పడ్డారు ఈ క్రమంలో ఎకరాకుర లక్షల నుంచి 7న్నర లక్షల వరకు ముడుపులు ముట్ట చెప్పిన రైతుల, భూములే సేకరించారు భూముల సేకరణ వ్యవహారంలో గోపి కోట్లలో లబ్ది పొందారు ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తేలు కుట్టిన దొంగల తిరిగి, కోటి 16 లక్షలు రైతులకు వెనక్కి ఇచ్చేశరు.
మట్టి ఇసుక అక్రమ రవాణ ద్వారా వచ్చే మామూలు తగ్గకుండా ప్రైవేట్ వ్యక్తులని పెట్టుకొని ప్రతి ట్రిప్ కు సొమ్ము వసూలయ్యేలా గోపీనాథ్, ఏర్పాటు చేసుకున్నారు జగనన్న కారణీలకు ఉచితంగా పంపిణీ చేసే ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు, బార్ అండ్ రెస్టారెంట్ల కోసం తనకు కమిషన్ ఇవ్వకుండా ఎవరైనా టెండర్ వేస్తే, వారిని అధికారులు పోలీసుల ద్వారా వేధించేవారు, నరసరావుపేట రోడ్డులో దాబా హోటల్ నిర్వహించే ఓ వ్యక్తి టెండర్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తే, గోపి ఫుడ్ సేఫ్టీ అధికారులతో దాడులు చేయించారు, టెండర్ వేయనని హామి ఇచ్చిన తర్వాతే అధికారులు అక్కడి నుంచి కదిలారు. నియోజక వర్గంలో రేషన్ మాఫియా కూడా గోపి కనుసన్నంలోనే నడిచింది నెలకు 10 లక్షలు ముడుపులు అందుకున్నారు, రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతో పాటు అదనంగా 3% వసూలు చేయాలని అధికారులపై ఒత్తిరి తెచ్చారు, టౌన్ ప్లానింగ్ అధికారిని చీరాల మున్సిపాలిటీకి బదిలి చేస్తే ఒక్కరోజు కూడా పని చేయకుండా మంత్రి, అంటదండలతో చిలకలూరి పేటలోనే పాగవేయడం విశేషం ఇప్పుడు గోపి అరెస్ట్ తో మిగతా వారిలోనూ ఆందోళన మొదలైంది.
