గాజా : గాజాపై ఇజ్రాయిల్ అమానుష దాడులు కొనసాగుతునే వున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున గాజాపై జరిగిన వైమానిక దాడుల్లో పిల్లలతో సహా 50 మంది మరణించారు. జబాలియా పట్టణంలోని శరణార్థి శిబిరంలో 10మంది మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారిలో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఇండోనేషియా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దక్షిణ గాజా నగరమైన ఖాన్‌యూనిస్‌లో ఏడుగురు మరణించారని, వారిలో ఒక గర్భిణీ కూడా ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
జెరూసలెంలో పర్యటించిన అమెరికా నూతన రాయబారి
ఇజ్రాయిల్‌కు అమెరికా నూతన రాయబారి మైక్ హకబీ శుక్రవారం మొదటిసారి బహిరంగంగా కనిపించారు. పాత జెరూసలెం నగరంలోని అత్యంత పవిత్రమైన యూదు ప్రార్థనా స్థలం వెస్ట్రన్ వాల్‌ను సందర్శించారు. ప్రార్థనా మందిరం గోడలో ఒక కాగితాన్ని ఉంచారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ దానిపై చేతితో రాశారని చెప్పారు. జెరూసలెంలో శాంతి కోసం ప్రార్థించాలని ట్రంప్ కోరారని హకబీ తెలిపారు. హమాస్ ఆధీనంలోని మిగిలిన బందీలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హకబీ మీడియాకు వివరించారు.