
జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది పర్యాటకులు గాయపడ్డారు. అనంతనాగ్ పహాల్గాం లో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా మూకుమ్మడిగా కాల్పులు జరపడంతో భయపడి పరుగులు తీశారు. పహాల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడ్డారు. అయితే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే కాలినడకన, గుర్రాలపైనే చేరుకునేందుకే అవకాశాలున్నాయి.
గాయపడిన వారిలో…
అందుకే ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగపడ్డారు. అయితే గాయపడిన పర్యాటకులను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే భద్రాతాదళాలు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకుని ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. గాయపడిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉగ్రవాదులు జరిపిన ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టారు.