డీజీపీకి ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు
హైదరాబాద్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులతో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను మోసం చేస్తున్నాయ ని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది. ఆ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సినీనటులు అల్లు అర్జున్, శ్రీ లీలపై వెంటనే క్రిమినల్ కేసులను
నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందరు మంగళవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ కలిసి ఫిర్యాదు చేశారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకుల విషయంలో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు అనేక అక్రమాలకు పాల్పడు తున్నాయని విమర్శించారు. వాటిపై చీటింగ్ కేసుల ను నమోదు చేయాలని కోరారు. తొమ్మిదో ర్యాంకు శివన్ వికాస్ తోష్నివాల్, 12వ ర్యాంకు సౌరవ్ సాధించారని వివరించారు. నారాయణ కాలేజీ, శ్రీచైతన్య కాలేజీ రెండూ ప్రకటనల్లో వారిద్దరి ర్యాంకు లను ప్రకటించాయని తెలిపారు.
ఒక కాలేజీలో చది విన విద్యార్థి ఇంకో కాలేజీ ర్యాంకును ఎలా సాధిస్తా రని ప్రశ్నించారు. రూ. లక్షలు, రూ. కోట్లకు ర్యాంకర్ ను విద్యాసంస్థలు కొనుగోలు చేస్తున్నాయని విమ ర్శించారు. వేరే రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులనూ కార్పొరేట్ కాలేజీల్లో చదివినట్టుగా ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండకూడదంటూ విద్యాశా ఖ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాటిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, కార్యవర్గ సభ్యు లు సామిడి వంశీవర్ధన్రెడ్డి, నాయకులు అరుణ్, హరీశ్, రఘు, వెంకటేశ్, అరవింద్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
