
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి.ఈ ఘటన సోమవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలుకావడంతో తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని హైదరాబాద్కు తరలించినట్లు కుటుంబీకులు వెల్లడించారు.