
అధికారం దుర్వినియోగం చేస్తున్నారంటున్న అమెరికన్లు అప్రూవల్ రేటింగ్ 42 శాతానికి క్షీణత
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజా దరణ క్షీణిస్తోంది. వైట్ హౌస్ లో బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ అప్రూవల్ రేటింగ్ గణనీయంగా తగ్గి, కనిష్ఠ స్థాయికి చేరుకున్నది. తాజాగా నిర్వహించిన రాయిటర్స్/ ఇప్సోస్ పోల్లో కేవలం 42 శాతం మం ది అమెరికన్లు ట్రంప్ పరిపాలన విధానాలను సమర్థిస్తున్నట్లు వెల్లడైంది. మూడు వారాల క్రితం 43 శాతంగా ఉన్న ఈ రేటింగ్ జనవరి 20న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నమోదైన 47 శాతం కంటే తగ్గడం గమనార్హం. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియో గం చేస్తున్నారనే భావన అమెరికన్లలో రోజురోజుకు పెరుగుతోందని ఈ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రభుత్వ మంత్రిత్వశాఖలపైనే కాకుండా విశ్వవిద్యాలయాలు వంటి సంస్థలపై కూడా తన పట్టును పెంచుకునే లక్ష్యంతో అనేక కార్యనిర్వాహఖ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యల వల్ల ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని అధిక శాతం మంది భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. అధ్యక్షుని అధికారాలకు కళ్లెం ఉండాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుం టున్నారు. ఫెడరల్ కోర్టుల తీర్పులతో ఏకీభవించకపోయినా అధ్యక్షుడు వాటిని అనుసరించాలని, చట్టాన్ని గౌరవించాలని అత్యధిక శాతం (83 శాతం) మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మొత్తం 4306 మం దిపై ఈ సర్వే నిర్వహించారు.