
గాజాపై దాడులను కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ మనుగడ సాగించాలంటే పోరాడుతూనే ఉండాలని మీడియా సమావేశంలో చెప్పారు. శనివారం రాత్రి నెతన్యాహూ ఒక మీడియా సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. విజయం కోసం మన ఉనికి కోసం పోరాడుతూనే ఉండటం తప్ప, వేరే మార్గం లేదని అన్నారు. హమాస్‌ను ఓడించడం, గాజాలో బందీలుగా ఉన్న 59 మందినికి రక్షించడం కోసం పోరాటం తప్పదని అన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించడంతోనే గాజాపై బాంబు దాడులు కొనసాగిస్తున్నామని అన్నారు. హమాస్ డిమాండ్లకు లంగిపోతే మన సైనికులు, మరణించిన, గాయపడిన హీరోలు సాధించిన అద్భుతమైన విజయాలన్నీ వృధా అవుతాయని అన్నారు. నెతన్యాహూ ప్రసంగాన్ని హోస్టేజ్ ఫ్యామిలీ ఫోరం ప్రధాన కార్యాలయం ఖండించింది. బందీలను విడుదల చేయించడంలో నెతన్యాహూకి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించింది.